calender_icon.png 29 December, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా పెరిగిన నేరాలు

29-12-2025 12:45:33 AM

వార్షిక నివేదిక సమర్పించిన పోలీస్ కమిషనర్

హనుమకొండ, డిసెంబర్ 28 (విజయ క్రాంతి):పరిధిలో నేరాలు గత సంవత్సరంలో పోల్చితే స్వల్పంగా పెరిగాయని వ రంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. శనివారం భీమారంలోని శు భం కళ్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక సీపీ సన్ ప్రీత్ సింగ్ నివేదిక నివేదిక-2025 సమావేశాన్ని నిర్వహించి బు క్ లెట్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం నేరాల పెరిగాయన్నారు. గత ఏడాది మొత్తం 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసు లు నమోదయ్యాయన్నారు. ఇందులో హత్య కేసులు నాలుగు, దారి దోపిడీ మూడు, దోపిడీలు 16 కేసులు, దొంగతనాలు 355 కేసులు రిజిస్టర్ అయ్యాయన్నారు.

మహిళలపై తగ్గిన నేరాలు....

గత ఏడాదితో పోలిస్తే 2024లో 1,504 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,453 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. దీనితో మొత్తం మీద 3.6శాతం మహిళలపై నేరాలు తగ్గు ముఖం పట్టాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. హత్యలు 36, మానభంగాలకు సంబంధించి గత ఏడాది 145 కేసులు నమోదు కాగా ప్రస్తు తం 132 కేసులు నమోదయ్యాయని, వీటితో పాటు వరకట్న మరణాలు, డొమెస్టిక్ నేరా లు తగ్గు ముఖం పట్టగా, పోక్సో కేసులు గత ఏడాది 364 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 405 కేసులు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

రూ.8.62 కోట్ల మత్తు పదార్థాల పట్టివేత....

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈఏడాది మత్తు పదార్థాలకు సంబంధించిన 195 కేసుల్లో మొత్తం 482మందిని అరెస్టు చేయడంతో పాటు వీరి నుంచి రూ.8.62కో ట్ల విలువ కలిగిన 1,700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. చోరీలకు సంబంధించి వివిధ చెందిన 14 గ్యాంగ్లకు సంబంధించి 33 కేసుల్లో 52 మంది నిందితులను రాష్ట్రాలకు అరెస్ట్ చేశామన్నారు.

ముఖ్యంగా సీసీఎస్ విభాగంలోని 84 చోరీ కేసుల్లో మొత్తం రూ. 79 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసు లు తిరిగి స్వాధీనం చేసుకున్నారన్నారు. ట్రాఫిక్ కేసులకు సంబంధించి ఈ ఏడాది 1.424 కేసుల్లో 430 మంది మృతి చెంద గా1446 మంది తీవ్రంగా గాయపడ్డారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలుకు 887 మంది జైలుకు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 34,282 మందిపై కేసులు నమోదు కాగా ఇందులో 887 మంది జైలు శిక్ష విధించడం జరిగిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సైబర్ సైబర్ క్రైమ్ సంబంధించి 630 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్‌పరిధిలో మొత్తం 6,040 కేసు లు పరిష్కారం కాగా ఇందులో 2,573 మందికి శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. ఇందులో ప్రధానంగా మందికి జీవితఖైదు శిక్ష పడగా, మరో ముగ్గురికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారన్నారు. గతే ఏడాది కంటే మూడు శాతం అధికంగా నేరస్తులకు శిక్షలు ఖరారయ్యాయన్నారు.

ప్రధానంగా నేరాల నియంత్రణలో టాస్క్ఫోర్స్ పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. ఈ విభా గం వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 418 కేసుల్లో 978 మందిని అరెస్టు చేయడంతో పోటు సుమారు రూ.14.80కోట్ల సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రాబోవు నూతన సంవత్సరంలో పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమములో డీసీపీలు రాజమహేంద్రనాయ క్, ధారా కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్ పాటు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్ ఐలు, ఎస్త్స్రలు పాల్గొన్నారు.