calender_icon.png 2 January, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలి

29-12-2025 12:48:34 AM

ఫార్మసి కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వీసి ప్రతాప్ రెడ్డి

హనుమకొండ, డిసెంబర్ 28( విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల అంటేనే గతం ఎంతో ఘనం అని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం విద్యార్థులు తమ భవిష్యత్తులో నిర్మించుకోవాలని, ఈ నేపధ్యం లో ప్రస్తుత ఫాకల్టీ పై పెద్ద బా ధ్యత ఉంది అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నా రు. విశ్వవిద్యాలయ ఫార్మసి కళాశాల గోల్డెన్ జూబిలీ ముగింపు సమావేశం హనంకొండ లోని, బాలసముద్రం లోని, కాళోజి కళాక్షేత్రం లో అదివారం మధ్యహ్నం జరిగిన ముగింపు సమవేశం లో పూర్వ విద్యార్థులు, అతిధులు, అవ్హనితులు,

విశ్రాంత ఉద్యోగు లు, బోధనా సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఉద్దేశించి ప్రసంగించారు, ఫార్మసి కళాశాల ప్రారంభం లో పని చేసిన అధ్యాపకుల సేవలు మేరువలేనివి అని కొనియాడారు, తక్కవ వసతులు, ప్రతికూల పరిస్థితులు, నిధుల లేమి ఉన్నప్పట్టికీ, ఉన్న దాంట్లో సర్దుకొని గొప్ప పరిశో ధన, బోధన జరిగింది అని, నాటి విద్యార్థులు నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించా బడి, విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలను పెం చారు అని కొనియాడారు.

యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ సంవత్సరం లో అడిగింటింది అని, ఈ సందర్భంగా గుర్తు చేసారు, ప్రముఖ ఫార్మసి సంస్థ అరబిందో లిమిటెడ్ విశ్వవిద్యాలయా విద్యార్థులకు ప్రాంగణ నియమకంలు, ఇంటర్న్ షిప్ లు, ఇండస్ట్రియల్ విజిట్ లు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అబినందనలు తెలిపారు.ఫార్మసి పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయము లో 4 ఎండోమెంట్ లెక్చరు లు ఏర్పాటు కు ముందుకు వచ్చారు అన్నారు.

అంతకు ముందు ఉదయం జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, విద్యా వేత్తలు, పారి శ్రామిక వేత్తల తో ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసారు.వీరిలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని అమెరికా సంయుక్త రాష్ట్రా ల, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమణ కుమారి మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసి కళాశాల జీవితం నేర్పింది అని, అభ్యాసన లో క్రమశిక్షన అవసరమని, రోగి దృక్పదం తో ఆలోచించాలి అని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి అని, డ్రగ్ తయారీ లో క్రిటికల్ గా అంచనా వేయాలి అన్నారు,

విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, అమెరికా సం యక్త రాష్ట్రాల ఎ అండ్ ఎం. యూనివర్సిటీ డీన్ డాక్టర్ మన్సూర్ ఖాన్ మాట్లాడుతూ గొప్ప గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ ల లోనే తయారు అయినవి అని అన్నారు, యూనివర్సిటీ, ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అబివృద్ధి లో చాల ఉపయోగ పడుతుంది అన్నారు, మేడికేషన్ నూతన పో కడలు చాల వచ్చాయి అన్నారు, డ్రగ్ లోప ల పై చట్ట పరమైన చర్యలు ఉంటాయి అని అన్నారు,

కాకతీయ యూనివర్సిటీ ఏదైనా సాదించ గలదు అన్నారు, సైన్సు గొప్ప తనం హెల్త్ కేర్ అబివృద్ధి పైనే ఉంది అన్నా రు, గోల్డెన్ జూబిలీ ముగింపు సమావేశాల కన్వీనర్, అమెరికా సంయక్త రాష్ట్రాల ఎ అం డ్ ఎం. యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ సాంబా రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ సిటిజెన్ గా గర్వ పడుతున్న్ను అన్నారు, నోబెల్ ప్రైజ్ స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి అని, పబ్లిక్ కేంద్రంగా ఫార్మసి ఉంది అ న్నారు, ప్రపంచం ను మార్చే శక్తి ఫార్మసి కి ఉంది అన్నారు,

మరియొక పూర్వ విద్యార్ధి రాజు తోట మాట్లాడుతూ సమాజ హితంగా సైన్సు ఉండాలి అని, విద్యార్థులు బాగా చదవాలి అని, ఫండమెంటల్స్ మరువవద్దు అన్నారు, హైదరాబాద్ యూరో మెడికేర్ లి మిటెడ్ అదినేత, పూర్వ విద్యార్ధి డాక్టర్ జే. రాజమౌళి మాట్లాడుతూ మైండ్ సెట్ మారాలి అని, మానవ సంబందాలు అవసరమని, మార్కెటింగ్ పై పట్టు పెంచుకొని ఉ త్పాదన పై దృష్టి పెట్టాలి అని, మంచి పుస్తకాలు చదవాలి అని అన్నారు,

మరియొక పూర్వ విద్యార్ధి డాక్టర్ సూర్య కుమార్ మా ట్లాడుతూ ఉద్యోగాలు ఉన్నాయి కానీ అర్హు లు లేరు అన్నారు, ఆసక్తి, కసి ముఖ్యం అని అన్నారు, పూర్వ విద్యార్థిని, జే.ఎన్.టి.యు ఫార్మసీ ఆచార్యులు ఆచార్య సునీత రెడ్డి మాట్లడుతూ కమ్యూనికేషన్ స్కిలల్స్ పెంచుకోవాలి అన్నారు, రెడ్డి ల్యాబ్ కళ్యాణ్ చక్ర వర్తి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు నిర్వహణ లో ఉన్న సంస్థల ప్రతినిధుల తో స మావేశం అవసరం అన్నారు, మరియొక పూర్వ విద్యార్ధి డాక్టర్ కే. సత్యనారాయణ మాట్లాడుతూ టెకస్ట్ బుక్స్ చదవాలి అన్నా రు.

ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉండాలి అన్నారు, పూర్వ విద్యార్ధి, అపోలో ట్రైనింగ్ డిపార్టుమెంటు ఆర్. హరీష్ చంద్ర మాట్లాడుతూ రి టైల్ ఫార్మసి లో విస్తృత అవకాశాలు ఉన్నా యి అన్నారు, గోల్డెన్ జూబిలీ సందర్భంగా నిర్వహించిన పోటిల విజేతలకు బహమతులు, అలుమ్ని కి మెమెంటో లు, సహకరిం చిన వారికీ అబినందనలు శాలువా, బోకే, మోమెంతో తో సన్మానించారు. పూర్వ వి ద్యార్థులు క్యాంపస్ ను సందర్శించారు. ఈ కార్యక్రమం లో వేదిక పై రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆచార్య వి.మల్లా రెడ్డి, ఆ చార్య వి. కిషన్, ఆచార్య సాంబా రెడ్డి, ఆచా ర్య ఎన్. ప్రసాద్, ఆచార్య జే. కృష్ణవేణి, ఆచా ర్య గాదె సమ్మయ్య, ఆచార్య వై. నరసింహ రెడ్డి, డాక్టర్ స్వరూపా రాణి, డాక్టర్ బి. నాగరాజు, డాక్టర్ షాయేద, డాక్టర్ రాజు తోట,   తదితరాలు పాల్గొన్నారు.