calender_icon.png 23 May, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీది ఒకే కుటుంబం

22-05-2025 01:25:31 AM

- పాత.. కొత్త భేదం లేదు

- పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు

- నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

- ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, మే 21 ( విజయక్రాంతి ) : 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీది ఒకే కుటుంబమని వట వృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ నీడన ఉండే ప్రతి కాంగ్రెస్ వాది పార్టీ బలోపేతం కోసం సైనికునిల పనిచేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

బు ధవారం వనపర్తి పట్టణంలోని కళ్యాణ సా యిఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వి స్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కు టుంబ తగాదాలు ఉన్నాయంటూ  నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని వారందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశమే చంపపెట్టు కావాలని ఎమ్మెల్యే పేర్కొ న్నారు.

నిరుపేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేస్తుందని ఇలాంటి ప్రజా సం క్షేమం కోరే  పార్టీలో పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని ఎమ్మె ల్యే పేర్కొన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పరిశీలకులు సంజయ్ ముదిరాజ్, గౌరీ సతీ ష్ ల సమక్షంలో నిర్వహిస్తున్న ఈ విస్తృతచారి సమావేశం కాంగ్రెస్ పార్టీ ఐక్యతను చా టి చెప్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రె స్ పార్టీ పదవులు ఆశించే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా దరఖాస్తు చేసుకుంటే పార్టీకి సులభ తరం అవుతుందని గ్రామ అధ్యక్షుడు, మం డలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులకు సంబంధించి పదవుల ఆశించే వారందరూ గ్రామ స్థాయిలోనే పూర్తిస్థాయి సమన్వయంతో పే ర్లను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్ర భుత్వ పథకాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులు వెనుకబడి పోతున్నారని ప్రతి ఒక్కరు పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.గత పదేళ్ల కాలంలో బి ఆర్ ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, ప్యాకేజీ నెంబర్ 27, బీమా ఫేస్ 1 ఫేస్ 2, గుడిపల్లి రిజర్వాయర్, కల్వకుర్తి ఎత్తిపోతల లాంటి అనేక ప్రా జెక్టుల నిర్మాణంలో డాక్టర్ చిన్నారెడ్డి పాత్ర ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు అక్కడక్కడ చిన్నచిన్న బొక్కలు పెట్టి తామే వనపర్తి నియోజకవర్గాని సాగునీరందించామని గొప్పలు చెప్పడం హాస్యాస్ప దమన్నారు. గత మార్చ్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తికి వచ్చిన సందర్భంలో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని 500 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, రూ 100 కోట్లతో రోడ్ల నిర్మాణం రూ 50 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం, వసతి గృ హాల నిర్మాణం లాంటి మరెన్నో పథకాలకు శంకుస్థాపనలు చేసుకున్న అభివృద్ధి జరగలేదంటూ సోషల్ మీడియా వేదికగా నిస్సిగ్గుగా ప్రచారం చేయడం వారికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే విమర్శించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని వే రే వారికి అవకాశం ఇస్తే కాళ్లలో కట్టే పెట్టి అ భివృద్ధికి ఆటంకాలుగా మారతారని ఎమ్మె ల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కో సం కొత్త పాత బేధం లేకుండా ఎలాంటి బేశేజాలు లేకుండా ప్రతి ఒక్కరు పనిచేద్దామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఆదిత్య రెడ్డి , టీపీసీసీ పరిశీలకులు సంజీవ్ ముదిరాజ్ గౌరీ సతీష్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.