22-05-2025 01:23:28 AM
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ మే 21 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ పట్టణం లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసిం ది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకుల తో కలిసి వర్షం కురిసిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ జా గ్రత్తగా ఉండాలని సూచించారు.
మహబూబ్ నగర్ లో డ్రైనే జీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాం ధీ 38 వ వర్థంతి సందర్భంగా అశోక్ టాకీస్ చౌరస్తా లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి, యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని ఆయన గుర్తు చేశా రు. నేడు ప్రపంచంలో భారతదేశం నాల్గొవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా అభివృద్ధి చెందుతుంటే అందుకు కారణం నాడు రాజీవ్ గాంధీ వేసిన పునాదులే కారణమని, భవిష్యత్తు అంతా కంప్యూటర్ దే అని గమనించి, నాడు విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో కంప్యూటర్ ను అందజేసి, సూపర్ కంప్యూటర్ ను దేశానికి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ కే చెల్లిందన్నారు.
ఆయన ఎదుగుదల చూడలేక విదేశీ శక్తులు కొన్ని ఆయనను మానవ బాంబు రూపంలో పొట్టన పెట్టుకున్నారని , దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయునికి ఈ సందర్భం గా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపిన అడుగు జాడ ల్లో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు న ర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఫయా జ్,అజ్మత్ అలి, సిజె బెనహార్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బా బా, ఐఎన్టీయుసి రాములు యాదవ్,నాయకులు అవేజ్, జేసిఆర్,అక్బర్, ఇమ్రాన్, చర్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.