calender_icon.png 19 October, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లకు రాజ్యాంగాన్ని సవరించాలి

18-10-2025 12:15:16 AM

బీసీ ఉద్యోగుల సంఘం 

ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ.. రిజర్వేషన్స్ లేక పోవడం వల్ల అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

బీసీ ఉద్యోగులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్నారు. శనివారం బీసీ బంద్‌కు సంఘీభావంగా రాష్ట్రంలోని బీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. సమావేశంలో రమాదేవి, జ్ఞానేశ్వర్, రామరాజు, శ్రీనివాస్, శంకర్, యాదయ్య, సాగర్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.