18-10-2025 12:13:23 AM
డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుకాణాలలో విస్తృత తనిఖీలు
మణుగూరు,(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజాన్ని అందించేందు కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీసులు డ్రగ్స్ పై యుద్ధం ప్రారంభించారు. పట్టణంలోని దుకాణాలలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... సమాజంలో డ్రగ్స్ తో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ కు బానిసలై ఎంతో మంది తమ జీవితాలను అంధకారంగా మార్చుకున్నారని గుర్తు చేశారు. పోలీస్ శాఖ డ్రగ్స్ నివారణకు కఠినమైన చర్యలు తీసుకుం టుందన్నారు. డ్రగ్స్ రవాణా, వాడకం నేర మని తెలిపారు. పాఠశాలలు కళాశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యా ర్థుల నడవడికను ఎప్పటి కప్పుడు గమనించి డ్రగ్స్ మహమ్మారికి బానిసలు కాకుండా అవగాహన కల్పించాలని, తల్లి దండ్రులు సైతం విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.