calender_icon.png 1 January, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేయాలి

01-01-2026 01:08:36 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు రావా ల్సిన రూ.512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బిల్లుల విడుదలపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోం దని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, కమీష న్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కని పించడం లేదా అని నిలదీశారు.

కమీషన్లు రావు అని బిల్లులు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.  బుధవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వచ్చిన మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు.  బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నామని, కుటుంబాలు నడవడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సంద ర్భంగా హరీష్ రావు స్పందిస్తూ... అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు.