calender_icon.png 26 October, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ దంపతుల వంటా వార్పు

26-10-2025 12:00:00 AM

ఇంటికి వెళ్లడానికి ఉన్న రోడ్డును కబ్జా చేశారంటూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన

ధర్మపురి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన నూకల నర్స వ్వ దంపతులు. వారి ఇంటికి వెళ్లడానికి ఉన్న రోడ్డును కొర్రి గంగయ్య కుటుం బం కబ్జా చేశారంటూ శనివారం జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట నర్సవ్వ, మల్ల య్య దంపతులు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.

కొర్రి గంగయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల స్థలలు రాగా పక్కనే ఉన్న తమ పట్టా భూమి నుంచి ఉన్న రోడ్డును కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగుతున్నా పట్టించు కోవడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. హైదరాబాద్‌లో ప్రజా దర్బార్‌లో సైతం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పట్టించుకోకాపోగా బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.