26-10-2025 12:00:00 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : తెలంగాణ- మహారాష్ట్ర సరిహ ద్దుల్లో గత కొన్ని నెలలుగా పెద్ద పులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి సంచా రం.. పశువులపై తరచూ దాడులతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజాగా శనివారం ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం కడోలి గ్రామ శివారులోని మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో నాలుగు పశువులపై పెద్ద పులి దాడి స్థానికుల్లో మరింత భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కడోలి గ్రామానికి చెందిన రైతు గెడం తులసీ రాంకు సంబంధించిన మూడు ఆవులు, ఒక లేగ దూడపై పులి దాడి చేసి హతమార్చింది.
విషయం తెలుసుకున్న ఆటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి పులి దాడిపై ఆరా తీశారు. కాగా రైతు గెడం తులసీ రాం కుటుంబాన్నీ అటవీ శాఖ అధికారులు ఆదుకోవాలని ఆదివాసి స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పెందోర్ సంతోష్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల రూపాయలను నష్టపరిహారంగా అందించాలన్నారు.