calender_icon.png 12 December, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా.. హుషారుగా..!

10-12-2025 01:36:14 AM

  1. ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

కన్నాయిగూడెం మండలమంతా ఇదే తంతు

ప్రతి ఓటరుపై ప్రత్యేక దృష్టి పెడుతున్న అభ్యర్థులు

అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారాలు

కన్నాయిగూడెం,డిసెంబర్9(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలతో గ్రా మాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పల్లెల్లో హ డావుడి చేస్తున్నారు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. సర్వశక్తులు ఒ డ్డుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మద్దతుదారులకు మందు,విందులు ఇవ్వడం,ప్రత్యర్థి వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కదుపుతున్నారు.

ముమ్మరంగా సాగుతున్న ప్రచారం..

కన్నాయిగూడెం మండలంలోని 11గ్రామ పంచాయతీలలో మొదటి రోజు ప్రచారం మొదలైంది.బుట్టాయిగూడెం, ఏటూరు, గూ ర్రేవుల, లక్ష్మీపురం, తుపాకులగూడెం, సర్వా యి, ఐలాపూర్,చింతగూడెం,కంతనపల్లి, రా జన్నపేట గ్రామ పంచాయతీలలో ప్రచారపర్వం మొదలైంది. మేజర్ గ్రామ పంచాయ తీ బుట్టాయిగూడెంలో సై అంటే ‘సై‘ అం టూ ఎన్నికల సమరం జరుగుతుంది మండలమంత బుట్టాయిగూడెం వైపే మరింతగా ఎదురు చూస్తుంది.

మండలంలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం--సాయంత్రం వేళలలో ప్రచారం

కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్రామ పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వాల్ల గుర్తు చూపి ఓటువేసి గెలిపించాలని, విజ్ఞప్తి చేశారు.పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సాయంత్రం వేళల్లో ప్రచారంపై ప్రత్యేకదృష్టిని సారిస్తున్నారు. పొద్దంతా పొలం బాట పడుతున్నావారిని రాత్రివేళల్లో కలసి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళలోనే గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందడి కనిపిస్తుంది.