calender_icon.png 18 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీలో కొలువులు

18-09-2025 01:22:03 AM

గుడ్‌న్యూస్

1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

1,00౦ డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగార్థులకు ఆర్టీసీ శుభవార్త తెలిపిం ది. టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవ ర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీఎల్ పీఆర్‌బీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులకు ప్రకటన జారీ చేసిం ది. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నా రు.

ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో, అర్హులైనల నుంచి దరఖాస్తు లు స్వీకరించనున్నారు. దరఖాస్తు విధానం, విద్య, ఇతర అర్హతలులాంటి పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎజీ ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.