08-08-2025 04:39:41 PM
పిఎసిఎస్ వద్ద ఉదయం నుంచి రైతుల పడిగాపులు..
వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం రోజుల తరబడి పరుగులు..
బెజ్జంకి: బెజ్జంకి పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం రైతులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. బెజ్జంకి వ్యవసాయ పిఎసిఎస్ మార్కెట్ యార్డులో ఉన్న గోడౌన్ వద్దకు శుక్రవారం ఉదయం నుంచే రైతులు వచ్చి పడికాపులు కాస్తుండడం యూరియా కొరతకు అద్దం పడుతోంది. నాట్లేసి నెల రోజులైనా యూరియా రాక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లోడ్ వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామ రైతులు బారులు తీరారు. ఒకే లోడు వచ్చిందని, మళ్లీ లోడ్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక ఎకరానికి ఒక బస్తా ఇవ్వగా, చాలా మంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.