calender_icon.png 12 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ బిజిలీ మహంకాళి ఆలయంలో చోరీ

12-01-2026 02:50:58 AM

తాళాలు పగలకొట్టి బంగారు, వెండి అభరణాల అపహరణ

సికింద్రాబాద్,  జనవరి 11 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని బిజిలీ మహాంకాళి అమ్మవారి దేవాలయంలో భారీ చోరీ  జరిగింది. దొంగలు ఆలయం తాళాలు పగలకొట్టి, అమ్మవారి బంగారు సూత్రం గొలుసు,వెండి అభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వాహకులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో బిజిలీ మహాంకాళి అమ్మవారి ఆలయం ఉంది.స్ధానికంగా ఉం టున్న నవీన్ అనే వ్యక్తి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం అమ్మవా రికి పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్ళి చూడగా,గుడి తాళాలను, గుడిలోని  హుండీ పగలగొట్టి ఉండడాన్ని గుర్తించారు.

అమ్మవారి సన్నిధిలో చూడగా, అక్కడ ఉండాల్సిన రెండు తులాల బంగారు అభరణాలు, కిలోన్నర వెండి అభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ మధుకుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాసు లు, క్రైం టీం సిబ్బంది వచ్చి  పరీక్షించారు. క్లూస్ టీమ్ ను పిలిపించి ఆధారాలను సేకరించారు. అర్దరాత్రి రెండు గంటల సమ యంలో చోరీ జరిగినట్లుగా అక్కడున్న సీసీ కెమెరాల ఆధారాలను బట్టి గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గణపతి ఆలయ చైర్మన్ ప్రభాకర్ తో కలసి ఆలయ నిర్వహకులు, స్థానిక బస్తీ వాసులు ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని నేరుగా స్థానిక ఎమ్మెల్యే ను కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఎమ్మెల్ వెంటనే ఇన్స్పెక్టర్ మధుకుమార్‌కు ఫోన్ చేసి ధర్యాప్తు వేగవంతం చేసి, దోపిడి దొంగలను పట్టుకొని, ఆమ్మవారి సొమ్మును రికవరీ చేయాలని సూచించారు..