22-10-2025 12:00:00 AM
-రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
-నేలపట్ల గ్రామ అభివృద్ధికి రూ. 6 కోట్ల 31 లక్షల నిధులు మంజూరు
-ధర్మ తండా గ్రామ అభివృద్ధికి రూ. 5 కోట్ల 95 లక్షల నిధులు మంజూరు
-కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం, అక్టోబరు 21 (విజయక్రాంతి) : పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసం బంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేలపట్ల గ్రామం లో ముదిగొండ రోడ్డు నుంచి కొత్త చెరువు వరకు 2 కోట్ల 75 లక్షలతో బీటి రోడ్డు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.
మునిగే పల్లి నుంచి వీరేంద్ర స్వామి దేవస్థానం వయా వెంకటాపురం మీదుగా 8 కిలోమీటర్ల మట్టి రోడ్డు 3 కోట్ల రూపాయలతో మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. నేలపట్ల గ్రామంలో 34 లక్షల రూపాయలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని, మరో 15 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అంగన్వాడి భవనానికి 5 లక్షల రూపాయలు, త్రాగునీటి మరమ్మతు పనులకు రెండు లక్షల రూపాయలు, ధర్మతండ గ్రామంలో 3 కోట్ల 75 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.
లోక్య తండా నుంచి ధర్మ తండా వరకు కోటి 26 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రోడ్డు ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, వర్షాకాలం లోపు ఆ రోడ్డు శంకుస్థాపన చేస్తామని, రాబోయే వర్షాకాలంలోపు ఈ రోడ్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. గత 22 నెలల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో ధర్మతండా గ్రామానికి 46 లక్షలతో అంతర్గం సిసి రోడ్లు నిర్మించుకున్నామని అన్నారు. 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించామని, మొత్తం ధర్మతండా గ్రామానికి 5 కోట్ల 95 లక్షల నిధులు అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
పేదల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, ఉగాది నుంచి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, నూతనంగా పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారి, పాత రేషన్ కార్డులలో నూతన సభ్యుల పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకోబ్, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.