10-01-2026 12:00:00 AM
నాగల్ గిద్ద, జనవరి 9: నాగల్గిద్ద మండలం కరస్గుత్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతుల కోసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గతనెల 28న విజయక్రాంతి దినపత్రికలో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు హుళక్కే ? అనే శీర్షికన ప్రచురించిన కథనానికి డీఈవో వేంకటేశ్వర్లు స్పందించారు. ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకపోవడంతో పాఠశాలకి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల విద్యాధికారి మన్మధ కిషోర్ తెలిపారు ప్రత్యేక తరగతులు నిర్వహించని వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.