10-01-2026 12:00:00 AM
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో గురుకులాల విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్. శారద వెంకటేష్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులు 5వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ప్రవేశ పరీక్ష రాయాలన్నారు.
పోటీ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించాలని కోరారు. గురుకులాల్లో విద్యార్థులు చదవడం వల్ల బయట ఉన్న పరిస్థితుల నుంచి పిల్లలు భద్రంగా పెరుగుతారని తెలిపారు సిద్దిపేట జిల్లాలోని గురుకుల పాఠశాలల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.