11-02-2025 12:16:57 AM
సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్‌లో దర్యాప్తు చేపట్టిన జిల్లా వైద్యాధికారులు
ఆపరేషన్ గది సీజ్
శేరిలింగంపల్లి,ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మియాపూర్ మదీనగూడ సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ లో మృతదేహానికి వైద్యం ఘటనపైరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిరియస్ అయ్యింది. మృతదేహానికి మూడు రోజుల పాటు వైద్యం చేసి అనంతరం అప్పగించారనిమృతురాలు బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేసిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. వెంటనే చర్యలకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం అధికారులు తనిఖీ చేసేందుకు రాగా సిబ్బంది సహకరించకోవడంతో తిరిగి సోమవారం మళ్ళీ రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు మదీనగూడ సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రిలో దర్యాప్తు నిర్వహించారు. కడప జిల్లా నందనూరు గ్రామానికి చెందిన జి. సుహాసిని పోయిన నెల 12 వ తారీఖు సిద్ధార్థ ఆసుపత్రిలో చేరింది.
అయితే ఈ క్రమంలో ఏమేం ట్రీట్మెంట్ చేశారని ఎలా చనిపోయింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు కేసుషీట్ ను పరిశీలించారు. పేషేంట్ ఎప్పుడు ఆస్పత్రికి వచ్చారు. ఎలాంటి పరిస్థితిలో జాయిన్ అయ్యారు అనేవిషయాన్ని ఆసుపత్రి ఎండీ డాక్టర్ సిద్దార్థ్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పేషెంట్ చనిపోయింది అనేది దర్యాప్తులో నిజనిర్ధారణ అయితే ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రిలో 28 మంది చికిత్స పొందుతున్నారని ఇంక కొత్తవారిని ఎవరిని ఇన్ పేషేంట్స్ గా చేర్చుకోవద్దని ఆదేశించారు. ముందస్తుగా థియేటర్ ను క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. తిరిగి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.