25-11-2025 05:08:29 PM
సిర్పూర్ (యు) (విజయక్రాంతి): మండలంలోని పుల్లారా గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా మొదటిసారి తన సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు డప్పులతో స్వాగతం పలికారు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని మండలంలోని అన్ని సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కోడిమెత యశ్వంతరావు, పార్టీ మండల అధ్యక్షులు శంకర్, మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేష్, సుద్దాల శ్రీను, గోడం శ్రీనివాస్,దేవిదాస్ రాము,ఆరిఫ్, మోతిరామ్, గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.