11-02-2025 12:17:47 AM
వనపర్తి, ఫిబ్రవరి 10 ( విజయక్రాంతి ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నద్ధత లో భాగంగా సోమవారం ఉదయం ఐ.డి.ఒ.సి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ లో మండల స్థాయి మాష్టర్ ట్రైనర్ లకు జిల్లా స్థాయి మాష్టర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలని, పోలింగ్ సిబ్బంది తనకు తోచినట్లుగా వ్యవహరించడానికి వీలు లేదని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణ పై జిల్లా స్థాయి మాష్టర్ ట్రైనర్ లు ఇచ్చే ఎన్నికల నిర్వహణ శిక్షణను బాగా అర్థం చేసుకొని మండల స్థాయిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డి.పి. ఒ సురేష్, జడ్పి సీఈఓ యాదయ్య, మాష్టర్ ట్రైనర్ శ్రీనివాస్, మండల ట్రైనర్లు పాల్గొన్నారు.