06-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో కమిషనర్ ఆర్. వి. కర్ణన్‌ని మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరాన్ని మరింత శుభ్రంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని డిప్యూటీ మేయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.