06-01-2026 12:00:00 AM
కలెక్టర్ హరిచందన
సికింద్రాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ప్రజావాణి అర్జీల పరిష్కారంలో అధికారులు ముందుండాలని హైదబరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్ పలని (రెవెన్యూ), జితేందర్ రెడ్డి (స్థానిక సంస్థలు), డిఆర్‌ఓ వెంకటాచారి లతో కలసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఆర్జీలపై అధికారులు శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని స్వీకరిం చిన దరఖాస్తులపై ఎండార్స్మెంట్ చేసి, సంబంధిత అధికారులకు అందజేశారు.
అలాగే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తుల పురోగతిపై , కలెక్టరేట్ ప్రజావాణి,వాట్సాప్ ప్రజావాణి పెండిం గ్ అర్జీలపై ఆమె సమీక్షించారు, ప్రజావాణి కార్యక్రమంలో హౌసింగ్ శాఖ 221, రెవెన్యూ 73, ఇతర శాఖలు 23 కలిపి మొత్తం 317 ఆర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం గురుకులం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026’వాల్ పోస్టర్‌ను సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ అశోక్ చక్రవర్తి,రెవెన్యూ డివిజనల్ అధికారులు సాయి రాం, రామకృష్ణ,సిపిఓ డాక్టర్. సురేందర్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంక టి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి,లా ఆఫీసర్ శ్రీధర్,జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కోటాజి, ఆశన్న పాల్గొన్నారు.