16-11-2025 12:12:03 AM
నష్టపోయిన రైతులు
నేరేడుచర్ల, నవంబర్ 15 (విజయక్రాంతి): నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో గల అవని ఫుడ్స్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి తూకంలో క్వింటా ధాన్యం తేడా వచ్చిందని రైతు పేరం రాజు ఆరోపించారు. అవని ఫుడ్స్ రైస్ మిల్లులో గత వారం పది రోజులుగా రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు.
అయితే ట్రాక్టర్ లోడ్‌కు తూకంలో క్వింటాలు తక్కువ వచ్చినట్టు తెలియడంతో రైతులంతా న్యాయం చేయాలని రైస్ మిల్ ముందు శనివారం ధర్నాకు దిగారు. ఒక ధాన్యం లోడుకు అవని ఫుడ్స్ రైస్ మిల్లులో 7,300 కిలోలు తూకం వస్తే వేరొక రైస్ మిల్లులో 7,400 కిలోలు తూకం వచ్చిందని రైతులు తెలిపారు. అంటే మిల్లు వే బ్రిడ్జి కాంటాక్ట్ ద్వారా 100 కిలోలు నష్టపోతున్నామని రైతులు గ్రహిం చి సదరు మిల్లు యజమాని లింగారెడ్డిని ప్రశ్నించగా వెంటనే కంప్యూటర్ సిస్టంలో గుట్టుచప్పుడు కాకుం డా సరి చేశారని రైతుల ఆరోపిస్తున్నారు.
రైతులు సదరు వే బ్రిడ్జి రూమ్ సిసి ఫుటేజీని బయటపెట్టాలని, మోసపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుల దోపిడీకి ఒకరకంగా అధికా రులు కూడా బాధ్యులేనని రైతులు ఆరోపించారు. మిల్లులలో మోసాలు జరుగుతుంటే అధికారు లకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకో పోకపోవడం వలన విచ్చలవిడిగా తమ ఇష్టారాజ్యంగా మిల్లు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.