calender_icon.png 16 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజిలెన్స్ అవైర్‌నెస్ వీక్‌ఱ

16-11-2025 12:13:37 AM

‘యూనియన్ బ్యాంక్’ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రాంతీయ అధికారి ఆరెడ్డి హనుమంతరెడ్డి, ఉప ప్రాంతీయ అధికారులు సర్వేశ్ టి, ఎన్. సుధాకర్‌రావు, ప్రాంతీయ విజిలెన్స్ అధికారి చి.బి.వి. ఎస్.శర్మ మార్గదర్శకత్వంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా శనివారం మూడు ప్రభావవంతమైన సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.

రోజు ప్రారం భంలో వాకథాన్ నిర్వహించి, విజిలెన్స్, నిజాయితీ, నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన పెంచారు. బ్యాంక్ సీనియర్ అధికా రులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి, బ్యాంక్ ఎంపవర్ హర్ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఇది పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడంతో పాటు మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమాల భాగంగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోటరీ నగర్ జడ్పి హై స్కూల్‌కు కంప్యూటర్‌ను దానం చేసి, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల నేర్పు అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.