calender_icon.png 2 August, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించారు

29-07-2025 10:28:52 PM

కేంద్ర మంత్రిని కలిసిన పైడి ఎల్లారెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి విజయఢంకా మోగిస్తానని రాష్ట్ర బీజేపీ నాయకులు పైడి ఎల్లారెడ్డి(BJP Leader Paidi Yella Reddy) అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని జెడ్పిటిసి, ఎంపీపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని పైడి ఎల్లారెడ్డి ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని వారు ఈ సందర్భంగా సూచించినట్లు పైడి ఎల్లారెడ్డి తెలిపారు.