25-10-2025 01:05:56 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరిందని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
ఘట్ కేసర్ మున్సిపల్ ఘనాపురం, లింగాపురంలలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలకు స్వంత గృహ సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు అందజేసిందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో తమకు సొంతింటి కలను నెరవేర్చినందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్ధం గోపాల్ రెడ్డి, అబ్బసాని యాదగిరి యాదవ్, మేడ బోయిన వెంకటేష్, రేవంతన్న టీం రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బర్ల రాధాకృష్ణ, మెట్టు గణేష్,
మహిళా విభాగం బి బ్లాక్ అధ్యక్షురాలు బర్ల అనీత, మున్సిపల్ అధ్యక్షురాలు ఫైళ్ళ లత, కీసర దేవస్థానం కమిటీ డైరెక్టర్లు సగ్గు అనీత, సామల అమర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, రైతు సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్, పాల్గొన్నారు.