25-10-2025 02:47:47 PM
ఊరూరా నాగుల చవితి వేడుకలు
మంథని, (విజయక్రాంతి): నాగుల చవితి(Nagula Chavithi) వేడుకలు శనివారం మంథని(Manthani)లో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మంథని పట్టణంలోని నాగుల సంధిలోగల నాగమయ్య పుట్ట వద్ద భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, నూతన వస్త్రాలను, అనేక రకాలైన పదార్థాలతో పాటు పండ్లు, ఫలాలు నైవేద్యంగా సమర్పించారు. నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి స్వామివారి సేవ చేస్తే సకల గోశాల నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, అలాగే మంథని మండలంలోని ఎంతో ప్రత్యేకత గల గాజులపల్లి లోని నాగమయ్య పుట్టను, కూచిరాజుపల్లెలోని నాగమయ్యను వేలాది సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజున 108 సార్లు శ్రీ నాగేంద్ర య నమః అని జపిస్తే నాగమయ్య కృపకు పాత్రులు అవుతారు. అలాగే బియ్యపిండి పాలు చక్కెరతో చేసిన చమిలిని బ్రాహ్మణునికి సమర్పిస్తే నాలుగవత ఎంతో తృప్తి చెందుతుందని శాస్త్రాలలో చెప్పబడింది.
నాగుల చవితి మంత్రం
పాములకు చేసే ఏదైనా పూజ నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ప్రపంంచంలో పాములు ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులలో నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వు పడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని నాగమయ్యను వేడుకుంటారు భక్తులు. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. నాగుల చవితిరోజు పుట్టలో పాలు పోయడం సంప్రదాయం. పుట్ట నుండి మట్టి తీసుకొని కళ్ళకు, చేవులకు రాసుకుంటే దోష నివారణ జరుగుతుంది.