25-10-2025 02:55:03 PM
పొచ్చమ్మ ప్రతిష్టాపన ఆలయ మహోత్సవ ఉత్సవాలు
హోమం నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు,గౌడ సంఘం సభ్యులు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని – చింతల పొచ్చమ్మ ప్రతిష్టాపన ఆలయ మహోత్సవ ఉత్సవాలు రెండో రోజు (శనివారం) కొనసాగుతున్నాయి. గణపతి హోమం, శాంతి హోమం, నిత్యపూజ, జపాహోమధులు సపరివార ఎల్లమ్మ తల్లి, చింతల పోచ్చమ్మ తల్లి మూల మంత్ర హవనములు, ప్రదోష పూజ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలకిషన్ గౌడ్, కిరణ్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, సాయిరామ్ గౌడ్, కిషన్ గౌడ్, సతీష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.