calender_icon.png 24 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

11-02-2025 12:00:00 AM

జగిత్యాల, ఫిబ్రవరి10(విజయక్రాంతి): ధర్మారం మండలం పత్తిపాకకు చెందిన కనుక మనవ్వ కు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె అయిన లత ను పాత గూడూరు గ్రామం వెల్గటూర్ మండలము కు చెందిన దేవయ్యకు ఇచ్చి వివాహం చేయడం జరి గింది. లత యొక్క భర్త  జీవన ఉపాధి నిమి త్తం బయట దేశానికి వెళ్లేవాడు.

పాత గూ డూరు గ్రామానికి చెందిన బోయిని రమేష్ అను వ్యక్తి లత యొక్క ఇంటికి అప్పుడ ప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. జనవరి7,2021 రోజున రాత్రి 11 గంటలకు సమయంలో రమేష్ లత యొక్క ఇంటికి వచ్చి, అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరుగగా, దానితో రమేష్ ఆమెని చంపాలని ఉద్దేశ్యంతో ఆమె ని గట్టిగా గొంతు పిసుకగా ఆమె ముక్కులో నుండి రక్తం వచ్చి చనిపోవడం జరిగింది.

మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అయిన బోయిని రమేష్‌ను  కోర్టులో హాజరు పరచడం జరి గింది. కేస్‌ను విచారించిన జిల్లా న్యాయ మూర్తి నీలిమ  నిందితునికి  జీవిత ఖైదుతో పాటు 25000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.