25-10-2025 12:59:47 AM
అధికారులను తప్పదోవ పట్టించి అనుమతులు
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జా
రాజకీయ పలుకుబడితో కార్యకలాపాలు
పర్మిషన్ రద్దు చేయాలని హెచ్‌ఎండీఏకు ఫిర్యాదులు
స్థానికులు ఫిర్యాదులతో రంగంలోకి హైడ్రా
అక్రమార్కులపై స్థానికుల న్యాయపోరాటం
సౌంటకుంట కబ్జా కథ రోజుకు ఒక్కొక్కటిగా బయటికొస్తుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో పర్మిషన్లు కావాలి. కానీ ఎఫ్‌టీఎల్ పరిధిలోని హద్దులను చెరిపేసి యథేచ్ఛగా వీఆర్‌సీ కన్వెన్షన్ ప్రభుత్వ స్థలాన్ని మింగేసింది.
అధికారులను బోల్తా కొట్టించి అనుమతులు పొందారు. మున్సిపల్ అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల పలుకుబడితో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టి జోరుగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.
రంగారెడ్డి/అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సౌటకుంటను వీఆర్‌సీ కన్వెన్షన్‌పూర్తి మింగేసింది. యజమాన్యం సంబంధిత అధికారులను సైతం తప్పుదోవ పట్టించి అనుమతులు పొందారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ హెచ్‌ఎండీఏ అధికారులు కన్వెన్షన్ నిర్మాణాలను అనుమతులు ఎలా ఇచ్చారనే అందరి మదిలో తోలుస్తున్న ప్రశ్న? పర్మిషన్లు గోరం తా..
నిర్మాణాలు మాత్రం కొండత చేశారు. కన్వెన్షన్ పై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకోకుండా వీఆర్‌సీ కన్వెన్షన్ యజమాన్యం తెలివిగా కోర్టు మెట్లెకింది. హెచ్‌ఎండీఏ అనుమతులను రద్దు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఇటీవల నే హెచ్‌ఎండీఏ అధికారులతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు.
కుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్, హైడ్రా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. అయితే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి గతంలో వీఆర్‌సీ కన్వెన్షన్, గోడౌన్లను పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనలు తూచ్..
పెద్దఅంబర్‌పేట్‌గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 184పీ, 185పీ, 187పీ సర్వే నెంబర్లలో 12,106.73 గజాల్లో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొంది సౌటకుంట ఎఫ్‌టీఎల్‌లో భారీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎఫ్‌టీఎల్‌పరిధిలో ఎలాంటి నిర్మాణలు చేయవద్దు అనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు గాలికి వదిలేసి.. స్థానికులు మున్సిపల్ అధికారుల అండదండలతో, రాజకీయ పలుకుబడితో భారీగా అక్రమ నిర్మాణాలు చేసి జోరుగా తమ వ్యాపారలను కొనసాగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
అనుమతులు రద్దుచేయాలని వీఆర్‌సీ కన్వెన్షన్‌పై ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్‌అధికారులు సౌటకుంట విస్తీర్ణాన్ని పరిశీలించారు. వీఆర్‌సీ పూర్తిగా సౌటకుంటలో ఉంటుందని నిర్ధారించారు. వీఆర్‌సీ సంబంధించి హెచ్‌ఎండీఏ అనుమతులను రద్దు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు ఫిర్యాదులు చేశారు. కన్వెన్షన్ నిర్మాణాలపై రెవెన్యూ, మున్సిపల్‌శాఖల అధికారులకు కూడా ఫిర్యాదులు ఇచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు వీఆర్‌సీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో... రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వెనకడుగు వేస్తారో చూడాలి మరి.
వీఆర్‌సీ కన్వెన్షన్, గోడౌన్లపై చర్యలు తీసుకోవాలి
సౌటకుంటలో నిర్మించిన వీఆర్‌సీ కన్వెన్షన్, అదే విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గోడౌన్లపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన వీఆర్‌సీ, గోడౌన్ల అక్రమ నిర్మాణాలపై అధికారులు కాలయాపన చేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి.
గంట లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌నాయకులు, పెద్దఅంబర్‌పేట్