20-09-2025 06:39:31 PM
స్కాలర్షిప్ లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు
3500 కోట్లు బకాయి పెట్టారు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి (విజయక్రాంతి): గత పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులకు, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 3500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుతలవారీగా వాటిని విడుదల చేస్తూ విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఒకటి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో ఇప్పటివరకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు కామారెడ్డి పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయాలన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించి కామారెడ్డి పేరును నిలబెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ కేటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డి ని స్టడీ అబ్బుగా ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను పంపిణీ చేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పలు అంశాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, డైరెక్టర్లు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.