20-09-2025 06:35:39 PM
మంత్రి కొండా సురేఖను కలిసిన నాచగిరి దేవస్థాన పాలక మండలి
గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి నిధులు మంజూరు చేయాలంటూ ఆలయ పాలకవర్గం శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు నాచగిరి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా కూడా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇటీవల ఆలయ పాలకవర్గం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన పల్లెర్ల రవీందర్ గుప్తా, కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు నాచగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ మేరకు పాలకవర్గ సభ్యులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్ అమలకు నిధులు మంజూరు చేయడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేసి త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు తెలిపారు. వారి వెంట పలకవర్గ మండల సభ్యులు చందా నాగరాజు, గాలి కిష్టయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, రుద్ర శ్రీహరి, తిరుమలరావు, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.