20-11-2025 01:06:16 AM
సంస్మరణ సభలో వక్తలు
ఘట్‌కేసర్, నవంబర్ 19 (విజయక్రాంతి): సరస్వతీ కటాక్షం పొందిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అని, ఆయన మాటలు, పాట లు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు వక్తలు కొనియాడారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపల్ అవుషాపూర్‌లో బుధవారం అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు.
ఎంపీ ఈటల రాజేందర్, ప్రొఫెసర్ కోదండరాం, సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి, మల్లేపల్లి లక్ష్మ య్య, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్‌గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, సినీ నటులు నారాయణమూర్తి, విమలక్క, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, శ్రీరామ్ సార్, మిట్టపల్లి సురేందర్, జయరాజ్, కవులు, రచయితలు కళాకారులు, అందెశ్రీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రు లు హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం అందెశ్రీ రచించిన ‘మాయమైపోతున్నడమ్మా‘ గేయాన్ని అరుణోదయ నిర్మల పాడిన సీడీని సభలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చైర్మన్ చామకూర భద్రరెడ్డి, ఘట్‌కేసర్ మా జీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, పిట్టల శ్రీశైలం, జంపాల రమేష్, చందుపట్ల వెంకట్ రెడ్డి, వి.బి. వెంకటనారాయణ, చందుపట్ల జీవన్‌రెడ్డి, మేకల పద్మారావు, లింగస్వామి, మర్రి శ్రీశైలం, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.