28-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే అవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మహి ళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో రాంచందర్ రావు, ఎన్నికల కోఇన్‌చార్జిలు అశోక్ పర్ణామి, రేఖాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణ గురించి రాంచందర్ రావు వివరించారు. మున్సిపల్ ఎన్ని కల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరు కష్టపడాలని నాయకులకు సూచించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో మంచి విజయావకాశాలున్నాయని కార్యకర్తలతో సమ న్వయం చేసుకుంటూ ప్రచారం చేస్తే విజయం మనదే అవుతోందని ఆయన ధీ మా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీరేందర్ గౌడ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
శంషాబాద్‌లో ముఖ్య నాయకుల భేటీ
మంగళవారం సాయంత్రం శంషాబాద్‌లో ఓ హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయ కులు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరిగిన వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించినట్లుగా తెలిసింది.
ప్రతి నాయకులకు మున్సిపల్ ఎన్ని కల బాధ్యతలను అప్పగించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, ఎన్నికల కోఇన్‌చార్జ్‌లు అశోక్ పర్ణామి, రేఖాశర్మ, సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ రఘునందన్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహే శ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.