28-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 27 (విజయ క్రాంతి) : బీఆర్‌ఎస్ నేతలపై బురదజల్లే ప్రతయ్నం చేశారని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛాన ల్ డిబేట్‌లో జరగనివి జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారని, దానిని నేను అడ్డుకు న్నానని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో పిచ్చి రాతలు, విష ప్రచారం చేసే వారి పట్ల మాట్లాడానని స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి నేతృత్వంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కలిశారు.
ఏబీఎన్ డిబేట్‌లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని తక్కళ్ల పల్లి రవీందర్‌రావు మండలి చైర్మన్‌కు ఫిర్యా దు చేశారు. తక్కళ్లపల్లి రవీందర్ రావు వెంట విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. అనం తరం తక్కళ్లపల్లి రవీందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ... ఛానల్ డిబేట్‌కు నన్ను గెస్ట్‌గా పిలిచి అవమానించడం కలిచివే సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎక్కడా అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడలేదని, అతిథి పట్ల ఇలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను మా పార్టీ సమావేశాలకు బాయ్ కాట్ చేశారని, మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, మా పార్టీ నాయకు లకు కతజ్ఞతలు తెలిపారు. మధుసూదనా చారి మాట్లాడుతూ... శాసనమండలి సభ్యు న్ని డిబేట్‌కి పిలిచి అవమానపర్చడాన్ని తీవ్రంగా ఖండించారు.
బీఆర్‌ఎస్ పార్టీ మీద కుట్రతో డిబేట్‌లో వ్యాఖ్యాత వ్యవహరించ డాన్ని ఎమ్మెల్సీ రవీందర్ రావు అడ్డుకుంటే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది రవీందర్ రావుపై జరిగిన దాడి కాకుండా శాసన మండలి సభ్యుల మీద జరిగిన దాడిగా భా వించి చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరినట్టు వివరించారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఏబీఎన్ ఛానల్ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తుం దని, పత్రిక ఉల్లంఘనలు చేయడం ఉద్యమానికి నష్టం చేసేలా మా నాయకుడు కేసీ ఆర్ మీద కూడా విష ప్రచారం చేశారని గుర్తుచేశారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానల్స్, పత్రికలు, మీడియాపై రవీందర్ రావు అన్న మాటలపై దురుసుగా వ్యవహ రించారని అనడాన్ని ఖండించారు. ప్రజలకు సంబంధించిన డిబేట్‌పై మై డిబేట్ అనడం ఏంటి అని ప్రశ్నించారు. గెట్ అవుట్ మై డిబేట్ అనడం దురహంకార ధోరణి అని మండిపడ్డారు. వచ్చిన గెస్ట్‌ల పట్ల ఇలా దురుసుగా మాట్లాడటం ఒక ట్రెండ్‌గా మారిందని విమర్శించారు.