22-12-2025 12:00:00 AM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సం ఘం జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనం లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భోగే ఉపేందర్ మాట్లాడుతూ కేం ద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరో పించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి, ఇప్పటివరకు అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని కోరారు.సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా క్వింటాల్కు రూ.40 చొప్పున నూతన రేట్లు పెంచాలని, వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరా రు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, మెడికల్ కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని, ఎన్హెచ్‌ఎం ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.జనవరి 18న ఖమ్మంలో జరిగే సీపీఐ భారీ బహిరంగ సభను సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్, సుధాకర్, జిల్లా కార్యదర్శులు దత్తు, తిరుపతి, కౌన్సిల్ సభ్యులు నాగేశ్, శ్రీనివాస్, దొందే రావు, జాడి లక్ష్మణ్, మోహన్ బాబు, మోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.