calender_icon.png 22 December, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి హాకీ విజేతలను సన్మానం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

22-12-2025 09:36:57 PM

వనపర్తి,(విజయక్రాంతి): ఈనెల 20, 21 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ న గర్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ - 19  హాకీ టోర్నమెంట్  బాలికల విభాగంలో మహబూబ్నగర్ హాకీ జట్టు మొదటి స్థానం సాధించింది. ఈ క్రమంలో  సోమవారం వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  తన నివాసంలో క్రీడాకారులకు (బాలికల విభాగం) శాలువాలతో సన్మానించి అభినందించారు.

జాతీయస్థాయిలోను సత్తా చాటాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయికి ఎంపికైన సుమధుర యామిని శ్రీజ భూమికలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, మన్యం యాదవ్, అనిల్ కుమార్, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ  పాల్గొన్నారు