22-12-2025 09:34:04 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాధరణ పొంది బెజ్జూర్ గ్రామపంచాయతీ లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, సభ్యులను సోమవారం సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూలమాలలు వేసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ గా దుర్గం సరోజ, ఉప సర్పంచ్ గా రాచకొండ ఆదర్శ్ తో పాటు 13 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని ఆయా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి యే ధ్యేయంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పరచుకొని గ్రామ ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. అనంతరం పాలకవర్గంను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సత్కరించారు.