22-12-2025 09:51:57 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొందినవారు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ములకలపల్లి మండలంలోని 19 గ్రామపంచాయతీల్లో పండుగ వాతావరణంలో కొనసాగింది. ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఆ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని హామీ ఇచ్చారు. సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు, ఎంపీ ఓ రమేష్,ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.