calender_icon.png 22 December, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

22-12-2025 09:45:59 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి):  మండలంలోని కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్ ,సృజన ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు వీరబాబు గార్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, బుస్సా వెంకటేశ్వర్లు, నాగయ్య, నట్టే ప్రవీణ్ సోమయ్య, సుధాకర్ రెడ్డి, సురేందర్, నట్టే జ్యోతి రజిత, రాధిక సత్యనారాయణ రెడ్డి, సరిత, తదితరులు పాల్గొన్నారు.