calender_icon.png 21 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత జర్నలిస్టు ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజు

20-11-2025 10:05:54 PM

జహీరాబాద్: దళిత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజును నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏ. డేవిడ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పోగు జాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా రాపాక విజయరాజుకు నియామక పత్రం అందజేయడం జరిగింది.

జిల్లా స్థాయి కార్యకలాపాలను బలోపేతం చేయడానికి, జర్నలిస్టు సమస్యలను మరింత ప్రభావవంతంగా పరిష్కరించడానికి రాపాక విజయరాజు నియామకం చేపట్టినట్లు ఫోరం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఫోరం వ్యవస్థాపకుడు కాశపోగు జాన్ ప్రభుత్వం దృష్టికి రెండు ముఖ్యమైన డిమాండ్లను తీసుకొచ్చారు.

దళిత జర్నలిస్టులకు రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీలో తక్షణమే ప్రతినిధిత్వం కల్పించాలని, అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని దళిత జర్నలిస్టులకు మొదటి విడతలోనే మంజూరు చేయాలని, జర్నలిస్టుల హక్కుల కోసం ఫోరం ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, దళిత జర్నలిస్టుల పురోగతికి ఈ నిర్ణయాలు అత్యంత కీలకమని కాశపోగు జాన్ స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాపాక విజయరాజు, మెదక్ జిల్లాలో దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తానని ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం  రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి ఎల్లేష్ జగత్ ప్రకాష్ పెద్దింటి స్వామి శ్రీకాంత్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.