13-01-2026 02:10:33 AM
మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విగ్రహం పూర్తిగా కనిపించకుండా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళు వెత్తాయి. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కట్టిన ఫ్లెక్సీని తొలగించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, ప్రచార పోస్టర్లు అంటించకూడదని, ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను పిల్లి సుధాకర్ కోరారు.