calender_icon.png 11 January, 2026 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్టుషాప్ నిర్వాహుకుల అత్యుత్సాహం

06-01-2026 12:00:00 AM

బెల్టుషాప్ వద్దంటే కిరాణo షాప్ కూడా నిర్వహించం అంటూ హుకుo

ఎండపల్లి మండలం అంబారిపేటలో ఘటన

ధర్మపురి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేటలో బెల్టుషాప్ నిర్వాహకులు సోమ వారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈనెల 1నుండి సర్పంచ్ దర్శనాల నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం బెల్టు షాప్ ల నిర్వాహణపై ఆంక్షలు విధించాయి. ఎట్టి పరిస్థితిల్లో గ్రామాల్లో బెల్ట్ షాప్ లు నిర్వహించొద్దనీ బెల్ట్ షాప్ నిర్వాహకులకు పాలకవర్గం హుకుం జారీచేసింది. పాలకవర్గం తీర్మానాన్ని తప్పుబడుతూ బెల్ట్ షాప్ నిర్వాహకులు, బెల్టు షాప్‌లు నిర్వహించొద్దంటే  కిరాణం షాప్‌లు కూడా నిర్వ హించం అంటూ సోమవారం షాపు లు మూసివేశారు. దీంతో నిర్వాహకులు చేసిన పనికి గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గం తీసుకున్న మంచి నిర్ణయానికి సహకరించడం మానేసి వ్యతిరేకించడం అందులో కిరాణం షాప్ లు కూడా మూసివేయడం ఏంటనీ గ్రామస్థులు మండిపడుతున్నారు.

ప్రజాభీష్టం మేరకే మూసివేత

ప్రజాభీష్టo మేరకే గ్రామంలో బెల్టు షాప్ ల మూసివేతకు గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. ఎట్టి పరిస్థితిల్లో బెల్ట్ షాప్ లు మూసివేయాల్సిందే. లేదంటే కిరాణంషాప్ ల లైసెన్స్ లు కూడా రద్దు చేస్తాం. గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కంటే వ్యక్తుల ప్రయోజనం ముఖ్యమేమి కాదు.బెల్ట్ షాప్ నిర్వాహకులు పాలకవర్గానికి సహకరిస్తారనీ ఆశిస్తున్నాం.

సర్పంచ్ దర్శనాల నరేష్ 

పాలకవర్గం తీర్మానాన్ని అభినందిస్తున్నాం

గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని అభిందిస్తున్నాం. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నo అవుతున్నాయి. యువత మద్యానికి బానిసై పక్కదారి పడుతుంది. ఈ అంబారిపేట గ్రామాన్ని ఆదర్శoగా తీసుకుని మిగిలిన గ్రామాలు కూడా బెల్టు షాప్ లపై ఉక్కుపాదం మోపాలి.

మోతె నరేష్, సామాజిక వేత్త, గ్రామస్తుడు