calender_icon.png 8 May, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉధృతమవుతున్న డంపింగ్ యార్డు ఉద్యమం

07-05-2025 12:00:00 AM

ఆందోళన బాట పట్టిన కాలనీవాసులు

కరీంనగర్, మే 6 (విజయ క్రాంతి) : కరీంనగర్ పట్టణం కోతిరాంపూర్లో ఉన్న డంపింగ్ యార్డు సమస్యపై ఉద్యమం ఉదృతమవుతున్నది. కోతిరాంపూల్లోని ప్రజలు జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగర శివారులోని మానేరువాగు ఒడ్డున 9వ. డివిజన్ పరిధిలో డంపింగ్ యార్డు ఉంది.

నగరంలోని 60 డివిజన్లలో 53,000లకు పైగా ఇండ్లు 2 లక్షలకుపైగా జనాభా ఉండగా, ప్రతినిత్యం 185 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి జరుగుతోంది. నగరపాలక సంస్థ ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఈ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నది. బయోమైనింగ్ ద్వారా చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 16 కోట్లతో బయోమైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు.

స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన ఈ పనులు నిలిచిపోవడంతో మళ్లీ డంపింగ్ యార్డు సమస్య మొదటికి వచ్చింది. కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న దుపింగ్ యార్డులో తరచు మంటలు చెలరేగడంతో శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంటుంది. బైపాస్ రోడ్డులో పూర్తిగా పొగ కమ్ముకుని వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.

ఏటా వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండగా అధికార యంత్రాంగం పింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అలాగే చెత్తలో మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ పొగ మాత్రం తగ్గడం లేదు. చట్టమైన పొగ వల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, దానికితోడు భరించలేని దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

అధికా రులు స్పందించి దుపింగ్ యార్డును తరలించాలని కోరుతూ కాలనీవాసులు జీఏసీగా ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కోతిరాంపూర్ లోని వరసిద్ధినగర్ కాలనీవాసులు శనివారం డంపింగ్ యార్డుకు చెత్తను తీసుకువస్తున్న వాహనాలను నిలిపివేసి ఆందోళనకు దిగారు.

డంపింగ్ యార్డు హఠావో.. కరీంనగర్ బచావో అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దుపింగ్ యార్డు ఎత్తివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే వచ్చే బల్దియా ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సోమవారం కూడా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో దంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

మంగళవారం చుట్టు పక్కల కాలని వాసులు ధర్నా నిర్వహించరిం డంపింగ్ యార్డు సమస్యపై ప్రజలు ఆందోళనకు  ప్రారంభించిన నేపథ్యంలో అధికా రులు, ప్రజాప్రతినిధులు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.