calender_icon.png 7 May, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి

07-05-2025 12:00:00 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

తిమ్మాపూర్, మే 6 : సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్.ఎం.డీ కాలనీలో (ప్రజాభవన్)లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్య కర్తల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వీలుగా పార్టీ నూతన కమిటీల ఏర్పాటుకు అధిష్టానం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా బ్లాక్, మండల పార్టీ అధ్యక్ష పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని పార్టీని పటిష్టపర్చడంలో అవసరమైతే మార్పులు తప్పవన్నారు. 

పార్టీ కోసం అందరు కష్టపడి పని చేయాలని, పార్టీని బలహీనపర్చే చర్యలకు ఎవరూ పూ నుకోవద్దని ఆయన హితవు పలికారు. తి మ్మాపూర్ మండలంలోని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు  మంగళవారం ప్రజాభవన్ కార్యాలయంలో  కపంపల్లి సత్యనారా యణ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో నుస్తులా పూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పం గుజ్జుల ప్రణీత్ రెడ్డి, లతోపాటు మాజీ సర్పంచులు నాయకులు కార్య కర్తలు పార్టీలో చేరారు. ఈ సమావేశంలో టీపీసీసీ పరిశీలకులు నామిండ్ల శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్,

ఒగ్గు దామోదర్, మండల పార్టీ తిమ్మాపూర్ అధ్యక్షులు బండారి రమేశ్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్రి ఓదె లు యాదవ్, పులి కృష్ణ, మాజీ ఎంపీపీ లు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్రెడ్డి, నాయకులు గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, అట్ల అనిల్, పోలు రాము, పోలు రమేశ్, ఆశిక్ పాషా పాల్గొన్నారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం ఃచొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, మే 6 (విజయక్రాంతి): ప్రభు త్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం  చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చొప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. జిల్లాలోని గంగాధర మండలం వెంకంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంగళవారం ఆయ న పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామ న్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులెవ్వరు ఆందోళనకు గురికావద్దని, తేమ శా తంతో సంబంధం లేకుండా  ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం కొనుగోల్ల వేగవంతం చేసి, ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

ధాన్యం కొను గోళ్లలో సమస్యలు ఉంటే  నా దృష్టికి తీసుకువస్తే, సంబంధిత శాఖ అధికారులు, లతో మాట్లాడి  సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే వెంటా  యూత్ కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, నాయకులు బైరిశెట్టి సంపత్ తదితరులు ఉన్నారు.