17-01-2026 12:44:35 AM
హనుమకొండ టౌన్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ నుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియం లో నిర్వహించిన 58వ సీనియర్ జాతీయ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు గురువారం ముగిసాయి. చాంపియన్షిప్ మహిళ ల టైటిల్ ను మహారాష్ట్ర, పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్ స్పోరట్స్ ప్రమో షన్ బోర్డులు గెలుచుకున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల ఫైనల్లో మహారా ష్ట్ర జట్టు ఒడిస్సా పై కేవలం ఒక డ్రీమ్ పా యింట్స్ స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఇండియన్ రైల్వేస్ జట్టు తమ సమిష్టి కృషితో వరుసగా రెండోసారి ఛాంపియన్షి ప్ ని గెలుచుకుంది.
ఫైనల్లో ఇండియన్ రైల్వేస్ జట్టు మహారాష్ట్ర జట్టు పై 26 , 21 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. పురుషుల విభాగంలో కొల్లాపూర్, ఒడిస్సా జట్లు వరుసగా 3, 4వ స్థానాలను పొందగా, మహిళల విభాగంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జట్లు అదే స్థా నంలో నిలిచాయి. అనంతరం తెలంగాణ ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రా ఘవరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతను క్రీడల పట్ల ఆకర్షితులను చేస్తూ వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఉనికిచర్లలో క్రికెట్ స్టేడియానికి 20 ఎకరాల స్థ లం, జిల్లాకు స్పోరట్స్ స్కూల్ మంజూరు చే యడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
దేశ నలుమూలల నుండి 1,500 మంది క్రీడాకారులు, 500 మంది టెక్నికల్ ఆఫీసర్స్ తది తరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు రైల్వే స్టేడియాన్ని కేటాయించిన దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ జట్టును నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు అ వార్డులను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ఖో ఖో అసోసియేషన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు టెక్నికల్ అఫీషియల్ కు జ్ఞాపికలను అందజేశారు.
అనం తరం ఖో ఖో పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించిన జంగా రాఘవరెడ్డిని తె లంగాణతో పాటు వివిధ రాష్ట్రాల ఖో ఖో అసోసియేషన్ బాధ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖో ఖో ఫెడ రేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు బంవార్ సింగ్ పలాడ, భారత ఖో ఖో జట్టు కెప్టెన్ ప్ర తీక్ వైఖర్, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఉపకార్ సింగ్, ఫెడరేషన్ టోర్లమెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎం.ఎస్ త్యాగి, ఉపాధ్యక్షులు సీతారాంరెడ్డి, తెలంగాణ, వరంగల్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ల ప్రధాన, కార్యదర్శిలు నాతి కృష్ణమూర్తి, తో ట శ్యాంప్రసాద్, తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్, టెక్నికల్ అఫీషియల్స్ రాజారపు రమేష్, సురేంద్ర విశ్వకర్మ, కుసుమ సదానందం, ఎన్‌ఐటి ప్రొఫెసర్ డాక్టర్ రవికు మార్, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.