calender_icon.png 29 July, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భవిష్యత్ విద్యార్థి చేతిలోనే..

28-07-2025 12:00:00 AM

ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు వస్తేనే ఎడ్యుకేషన్ హబ్ సాధ్యం

పమహబూబ్ నగర్ జూలై 27 (విజయ క్రాంతి) : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ధర్మాపూ ర్ శివార్ లోని ఆల్ మదినా ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన జికె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలని, విద్యాభివృద్ధికి అత్యధిక నిధులు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం జరుగుతుందన్నారు. వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్క సంవత్సరంలోనే పాలమూరు యూనివర్సిటీకి రూ 100 కోట్ల యూజీసీ నిధులతో పాటు లా , ఇం జనీరింగ్ కళాశాల, మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాల మంజూరు అయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు వస్తేనే మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్ గా సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. దేశం నిజమైన అభివృద్ధి సాధించాలంటే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఎడ్యుకేషన్ ఈస్ మోస్ట్ పవర్ పుల్ వెపన్ విచ్ యు కెన్ యూస్ టు చైన్జ్ ది వరల్ అని తెలియజేశారు. నెల్సన్ మండేలా గారి మాటలను ప్రతి క్షణం మనం గుర్తు తెచ్చుకోవాలన్నారు.

ఏదేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఆధారమని, అందుకే భార తదే శంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే కేవలం మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. జికె ఇంజనీరింగ్ కళాశాల రానున్న 10 సంవ త్సరాల లో, అలిగడ్ లోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం స్థాయికి ఎదగాలని ఆ యన ఆకాంక్షించారు.

ఇక్కడ ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా, రాజకీయాలకు అ తీతంగా మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహార్ , మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, అజ్మత్ అలి, అవేజ్, గులాం జహీర్, షా ఫైసల్, అజిమ్, బాసిత్, తదితరులు పాల్గొన్నారు.