calender_icon.png 11 July, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ వాసుల ఆరోగ్యమే లక్ష్యం : మేయర్ విజయలక్ష్మి

11-07-2025 12:07:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్ బస్తీ దవాఖానలో గురువారం మెగా ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం బస్తీ వాసుల ముంగిటకే వైద్య సేవలను తీసుకువస్తోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, బస్తీ దవాఖాన సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.