11-07-2025 12:07:23 AM
ప్రైవేట్ హాస్టళ్ల అడ్డాగా...
కరీంనగర్, జూలై 10 (విజయ క్రాంతి): జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్గా నిషేధిక మత్తు పదార్థాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు, హాస్టల్స్ వీటికి అడ్డాగా మారాయి. గంజా యి, ఇతర మాదక ద్రవ్యాలు యదేచ్ఛగా దొరుకుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా నియంత్రించలేకపోతున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ నగరంతోపాటు తిమ్మాపూర్ మండలం ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. కరీంనగర్ పరిధిలో రెండు ప్రైవే ట్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, శాతవాహన విశ్వవిద్యాలయం, ఫార్మసీ కాలేజీ, 3 ఇంజనీరింగ్ కాలేజీలు, 10 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. తిమ్మాపూర్లో మూడు ఇంజ నీరింగ్ కళాశాలలు, గురుకులాలు, ఇతర కార్పొరేట్కూల్స్ ఉండడంతో జిల్లా కేంద్రం తర్వాత ఇక్కడే అనేక విద్యాసంస్థలు వెలుస్తున్నాయి.
ఒక్క తిమ్మాపూర్ ఇంజనీరింగ్ కళా శాలలకు సమీపంలో ప్రైవేట్ హాస్టల్స్ పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. కరీంనగర్, తిమ్మాపూర్ లలో కలిపి 150 వరకు హాస్ట ల్స్ ఉంటాయి. అనుమతులు లేకుండానే వెలుస్తున్న సదరు వసతిగృహాల్లో అడిగేవా రు, చూసేవారు ఉండకపోవడంతో వాటిల్లో ఉండే విద్యార్థులపై పర్యవేక్షణ లోపిస్తున్నది. వెరసి అనేక మంది విద్యార్థులు వ్యవసనాల బారినపడి ఆగమవుతున్నారు.
ఒకప్పుడు జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రైవే ట్ హాస్టల్స్ ఉండేవి. నేడు తిమ్మాపూర్ మండలంలో మహాత్మానగర్ నుంచి రామకృష్ణ కాలనీ వరకు రాజీవ్ రహదారి వెంట జిల్లాలోనే అత్యధికంగా దాదాపు 70 వరకు హాస్టల్స్ వెలిచాయి. ఇందులో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులే అధికంగా ఉంటారు. మేనేజ్మెంట్ హాస్టళ్లతో సమానంగా ప్రైవేట్ హాస్టల్స్ నిర్వా హకులు ఒక్కో విద్యార్ధి వద్ద నెలకు 4 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తారు.
అయినప్పటికి సరైన సౌకర్యాలు కల్పించ డం లేదు. రాజీవ్ రహదారి వెంట ఆయా కళాశాలల సమీపంలో రెండు అంతస్తుల భవనం ఖాళీగా ఉంటే చాలు ఎ క్కడెక్కడి వారో వచ్చి హాస్టల్ బోర్డు పెట్టి వి ద్యార్థులను తీసుకుంటున్నారు. ఆయా సంస్థలు నడుపుతున్న ఇంజనీరింగ్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ హాస్టళ్లలో సౌకర్యాలతో పాటు నిర్వహణ కఠినంగా ఉంటుండడం వల్ల అక్కడి విద్యార్థులు రాత్రి సమయంలో బయటకు రాకుండా కట్టుదిట్టం చేస్తారు.
ఇక్కడ హాస్టళ్ల విద్యార్థులు స్టడీ అవర్స్ పై కూడా నిఘా ఉంటుంది. అయితే ప్రైవేట్ హా స్టళ్లలో మాత్రమే ఈ నియంత్రణ లేదు. ఒక టి రెండు హాస్టళ్లలో తప్ప సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడు. పిల్లలు ఇష్టారాజ్యంగా రాత్రుల వరకు రోడ్లపై సంచరిస్తూ ఉంటుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఇక్కడ ఇందిరానగర్, రామకృష్ణకాలనీల సమీపంలో చింతచెట్టు అడ్డాగా రాత్రి 11 గంటల వరకు కొందరు విద్యార్థులు గుమిగూడి గంజాయి మత్తులో తూగుతున్నట్లు తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లను నియంత్రించాల్సిన అవసరంతోపాటు విద్యార్థులు మత్తు బారిన పడకుండా పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లి దండ్రులుకోరుతున్నారు.