11-07-2025 12:05:54 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ ఎగ్జిబిషన్ ఈ నెల 13వ వరకు కొనసాగనుంది. దీనిని పురస్కరించుకుని అందులో ఏర్పాటైన స్టాల్స్ యజమానులకు, సేవకులకు గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్ని మిగిల్చింది అని ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా స్టాల్స్ యజమా నులు, సేవకులు వైద్యులకు, శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.