calender_icon.png 19 May, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

19-05-2025 12:00:00 AM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మే 18(విజయ క్రాంతి): జిల్లాలోని  ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం,  వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.

పలువురు బాలింతలతో మాట్లాడారు. ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజర పట్టిక పరిశీలించారు. ప్రతి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారని? గత నెలలో మొత్తం ఎంత మంది వచ్చారు?  అని ఆరా తీశారు. ఆసు పత్రికి  వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల న్నారు.  నియోజకవర్గంలోని ప్రజలందరూ  ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు సద్విని యోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు.